19, మే 2020, మంగళవారం

T. S. High Court on 10th Exams

*జూన్ మొదటి వారం తర్వాత పది పరీక్షలకు హైకోర్టు అనుమతి..*

హైదరాబాద్‌: *తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించి, 4న నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.*

 *పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉంటే పరీక్షలు నిర్వహించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.*

కామెంట్‌లు లేవు: