ది. 16-05-2020 సెస్ ప్రకటన
గౌరవనీయులైన శ్రీయుత సబితా ఇంద్రారెడ్డి గారికి,
విద్యాశాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,
హైదరాబాద్.
అమ్మా!
విషయం:- అంతర్గత పరీక్షల ఆధారంగానే పదో తరగతి విద్యార్థుల ఫలితాలు ప్రకటించాలని సెస్ విజ్ఞప్తి.
--------
కరోనా వైరస్ విపత్తు వలన విధించిన లాక్ డౌన్ ఫలితంగా వార్షిక పరీక్షలు లేకుండానే 1-9 తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ జీఓ 54 ద్వారా ప్రభుత్వం యిచ్చిన ఉత్తర్వులను "సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సిఈఎస్ఎస్)" సమర్ధిస్తోంది. అదే విధంగా అంతర్గత పరీక్షల ఆధారంగానే పదో తరగతి విద్యార్థుల ఫలితాలను ప్రకటించాలని సెస్ కోరుతోంది. మార్చి 19 నుండి ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగు మరియు హిందీ సబ్జెక్టుల తర్వాత మార్చి 22 నుండి ఆగిపోయినవి. రెండు నెలల కాలం గడుస్తోోంది. ఇంకెంత కాలానికి పరిస్థితి చక్కబడుతుందో తెలియడం లేదు. విద్యార్థులు పరీక్షలు వ్రాసే సంసిద్ధతా స్థితిని కోల్పోయారు. దూరదర్శన్ యాదగిరి ఛానెల్ ద్వారా చెప్పిన పాఠాలను యాభై శాతం పైగా విద్యార్థులు అందుకోలేక పోయారు.
జూన్ 15 నుండి లేదా మరో తేదీ నుండి అయినా సామాజిక దూరాన్ని పాటిస్తూ 5.5 లక్షల మంది పదో తరగతి విద్యార్థులకు యింకా ఎనిమిది రోజులు పరీక్షలు నిర్వహింహడం చాలా కష్టంతో కూడిన పని. అంతమంది విద్యార్థులతో పాటు 50 వేలమంది ఇన్విజిలేటర్లు మరియు సిబ్బంది రోజుకి మూడు గంటలు పైగా పరీక్షా కేంద్రాల్లో ఉండాలి. లక్షల మంది తల్లిదండ్రులు విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకురావడం, తిరిగి ఇళ్లకు తీసుకుపోవడం జరగాలి. ఆ తర్వాత సమాధాన పత్రాలు దిద్దడానికి (స్పాట్ వేల్యూయేషన్) మరో 50 వేలమంది ఉపాధ్యాయులు, సిబ్బంది పది రోజులు పైగా కొన్ని కేంద్రాల్లోనే ఉండి పనిచేయాల్సి ఉంటుంది.
పదో తరగతి పరీక్షల నిర్వహణకు తీసుకోబోయే జాగ్రత్తలు గురించి విద్యాశాఖ వారు హైకోర్టుకి అందించిన విషయాలతో సరిపోదని తెలియజేస్తున్నాము. పబ్లిక్ రవాణా అందుబాటులోకి రాకుండా హాస్టల్స్, ఆశ్రమ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు మరియు పట్నాల్లోని ప్రైవేట్ స్కూల్సులో చదివిన పల్లెటూళ్ల విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోలేరు. స్వంత ద్విచక్ర వాహనాలు లేని విద్యార్థుల తల్లిదండ్రులు గణనీయమైన సంఖ్యలో వుంటారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో పాటించే జాగ్రత్తలు గురించి చెప్పారు, కానీ కేంద్రాల బయట విద్యార్థులు గుంపులుగా చేరి పలకరించుకనే పరిస్థితిని నివారించగలరా? ఒకవేళ ఈ నెల 19న హైకోర్టు అనుమతించినా పరీక్షల నిర్వహణకు ఇంకా నెల రోజుల వ్యవధి అవసరమవుతుంది. మొత్తమ్మీద మూడు నెలల కాలం సుదీర్ఘ విరామం తర్వాత విద్యార్థులతో పరీక్షలు వ్రాయించాలనుకోవడం సరైంది కాదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరీక్షల కోసం పరీక్షలు నిర్వహించడం అనవసరం.
ఇలాంటి సంక్షుభిత పరిస్థితిలో ఇంతటి సంక్లిష్టమైన భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎందుకు? పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో దాదాపు 90% మంది పాసవుతున్న విషయం తెలిసిందే. ఫెయిలైన 10% మందిలో కూడా దాదాపు సగం మంది సప్లిమెంటరీ పరీక్షలో పాసవుతునే వున్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన నాలుగు ఫార్మేటివ్ టెస్టులు, ఒక సమ్మేటివ్ టెస్ట్ మరియు ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా ఫలితాలు ప్రకటించినా అదే పరిస్థితి ఉంటుంది. పదో తరగతి పరీక్షల ఫలితాలను గ్రేడుల్లోనే ప్రకటిస్తున్నందున పెద్ద తేడా ఉండదు. కనుక అంతర్గత పరీక్షల (ఎఫ్ఏలు, ఎస్ఏ, ప్రీ ఫైనల్) ఆధారంగానే పదో తరగతి విద్యార్థుల ఫలితాలను ప్రకటించాలని, మూడు నెెలల విరామం తర్వాత పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలనే ప్రయత్నం విరమించాలని కోరుచున్నాము.
భవదీయులు,
నాగటి నారాయణ, చైర్మన్ 9490300577
పగడాల లక్ష్మయ్య, సెక్రటరీ 9849868145
సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీస్ (సిఈఎస్ఎస్), హైదరాబాద్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి