ఇంగ్లీష్ మీడియం రాంజ్యాంగ విరుద్ధమా?
నాగటి నారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలనే జీఓ 85 రాజ్యాంగ విరుద్ధమని రద్దుచేస్ తూ రాష్ట్ర హైకోర్టు ఈనెల 15 న తీర్పు చెప్పింది. ఆ తీర్పు విద్యాబోధన మాధ్యమాల విషయంలో పెద్ద పరిశోధన పత్రంలా వుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.కే. మహేశ్వరి మరియు జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం యిచ్చిన 92 పేజీల తీర్పులో మాతృభాషా మాధ్యమం ప్రాధాన్యత, దానికి సంబంధించిన తాత్విక చారిత్రక మూలాధారాలు, విద్యావిధాన పత్రాల్లో మీడియం గురించి పేర్కొన్న పేరాలు, రాజ్యాంగ అధికరణలు, తెలుగుభాష గొప్పతనం మరియు ఇంగ్లీష్ మీడియం పట్ల విముఖత సుదీర్ఘంగా విశ్లేషించబడింది. సారాంశంలో ప్రాధమిక విద్య మాతృభాషలోనే ఉండాలని, తల్లిదండ్రులు కోరిన మీడియంలోనే పిల్లకు చదువు చెప్పాలని, మాధ్యమాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆదేశించడం జరిగింది. ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనువైన విద్య కావాలనే డిమాండ్ పెరుగుతున్న రోజుల్లో వచ్చిన ఈ తీర్పు వలన కలిగే ప్రయోజనం ఏమిటి అనేది చర్చనీయాంశం.
మీడియం విషయంలో హైకోర్టు తీర్పు గత కాలానికి యిచ్చిన ప్రాధాన్యత వర్తమానానికి, భవిష్యత్తుకు యివ్వకపోవడం శోచనీయం. మానవ సమాజం నిరంతరం మారుతుందనే విషయం తెలిసిందే. 20 వ శతాబ్దం నాలుగో భాగం నుండి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ వేగంగా మారిపోతూ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలను లోబరు చుకుంటోంది. సరుకుల, సేవల ఉత్పత్తిలో ప్రభుత్వ రంగం క్షిణిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ రంగం విస్తరిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అదే శరణ్యమవుతోంది. 2014 సంవత్సరంలో నికరమైన ఉద్యోగం లేదా ఉపాధి (వర్కుఫోర్స్) గలవారు 49.60 కోట్లు మంది. అందులో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారు 1 కోటి 76 లక్షల మంది అంటే 3.55 శాతం మంది మాత్రమే. ఆ సంఖ్య 2020 చివరికి యింకా తగ్గిపోతుంది. 'కోటి విద్యలు కూటి కొరకే ... కూడు పెట్టిందే కూసు విద్య' అన్నారు పెద్దలు. ఉద్యోగం పురుష లక్షణం అన్నది ఒకనాటి మాట. పురుషులైనా, మహిళలైనా చదువు పూర్తైన వెంటనే ఏదో ఓ కొలువులో స్థిర పడాలి. ప్రైవేట్ సంస్థల్లోని కార్పొరేట్ కంపెనీ ల్లోని కొలువులకు సబ్జెక్ట్ నా లెడ్జుతో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉన్నవారికే ప్రాధాన్యత వుంటుంది. ఈనాటి మార్కెట్ ఓరియెంటెడ్ ఆర్ధిక కార్యకలాపాల్ లో స్వయం ఉపాధి పనుల్లో కూడా ఆంగ్ల భాషా జ్ఞానం గలవారే రాణించగలుగుతున్నారు. కనుక ఇంగ్లీష్ మీడియంలో విద్య ఈనాటి అవసరం, అనివార్యం. అందుకే సంపన్నులతో పాటు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యాపారస్తులు వగైరా అందరి పిల్లలూ ఇంగ్లీష్ మీడియం కోసం ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్సులోనే చదువుతున్నారు. అలాంటి చదువే తమ బిడ్డలకు కావాలని ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు మీడియం విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అలాంటి న్యాయమైన కోర్కెను తీర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత.
పిల్లలను ఏ మీడియంలో చదివించుకోవాలో నిర్ణయించుకొనే హక్కు తల్లిదండ్రులకు మాత్రమే వుంటుందని, పేరెంట్స్ అసోసియేషన్స్ ఆకాంక్ష మేరకు మాధ్యమాన్ని మార్చడానికి వీల్లే దని ధర్మాసనం తప్పు పట్టింది. ఆ అభిప్రాయం సరైంది అయితే తల్లిదండ్రుల ఆకాంక్షకి అనుగుణంగా యిచ్చిన ఆంగ్ల మాధ్యమం ఉత్తర్వులను రద్దుచేయడం సరైంది కాదు. 2017-18 విద్యాసంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో 62 శాతం (44/70 లక్షలు) మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో వున్నట్లు యు-డైస్ రిపోర్ట్ ప్రకటించింది. ఆ సంఖ్య 2019-20 నాటికి 70 శాతం పైగా పెరిగి వుంటుంది. అంతమంది ఆంగ్లమాధ్యమంలో చేరింది తల్లిదండ్రుల కోరిక మేరకు కాదా? ప్రైవేట్ స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియమే వుంది. ప్రభుత్వ రంగంలోని రెసిడెన్షియల్, మోడల్, కేజీబీవీ, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలతో పాటు దాదాపు పదివేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం నడుస్తోంది. ఉర్దూ, కన్నడ, తమిళ, ఒడియా వగైరా ఇతర మీడియంలు పోగా ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిన సుమారు 25% మంది విద్యార్థులు మాత్రమే తెలుగు మీడియంలో వున్నారు. వారిలో అత్యధికులు దళిత, గిరిజన, మైనార్టీ కులాలకు చెందినవారే. ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లకు పంపలేక, దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వలన మాత్రమే తెలుగు మీడియంలో మిగిలిపోయారు తప్ప వారి పేరెంట్స్ కోరిక మేరకు కాదు. తమ పిల్లలను తెలుగు మాధ్యమంలోనే చదివించాలనుకునే తల్లిదండ్రులు పదిశాతం లోపే ఉండవచ్చు. 90 శాతం పైగా పేరెంట్స్ తమ బిడ్డలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే కోరికతో ఉన్నట్లు తెలుసుకోవడానికి ఈ డేటా సమాచారం సరిపోదా?
ఎలిమెంటరీ (8 వ తరగతి వరకు) విద్యను ప్రాధమిక హక్కుగా అందించాలని ఆర్టికిల్ 21 (ఏ) చెబుతుందే తప్ప మాతృభాషలోనే అందించాలనే ఆదేశం రాజ్యాంగంలో లేదు. ఆర్టికిల్ 350 (ఏ) లో చెప్పింది మైనార్టీ భాషల విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాభ్యసనకు తగిన ఏర్పాట్లు చేయాలని తప్ప మెజారిటీ భాషల వారికి కూడా మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని కాదు. అధికరణం 19 (1)(ఏ) లో చెప్పిన మాట్లాడే, వ్యక్తీకరణ చేసే హక్కు సాధారణ విషయానికి సంబంధించింది తప్ప విద్యా మాధ్యమానికి కాదు. అయినా అది విద్యా మాధ్యమానికి కూడా వర్తిస్తుందని గతంలో కర్ణాటక వర్సెస్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజిమెంట్స్ అసోసియే షన్ కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానాన్ని హైకోర్టు ధర్మాసనం బలపర్చింది. ఆచరణకు సాధ్యమైనంత మేరకు బోధనా మాద్యమం బాలల మాతృభాషగా వుండాలని మాత్రమే విద్యాహక్కు చట్టం సెక్షన్ 29 (2) (ఎఫ్) లో వున్నది. సాధ్యమైతే 5 వ తరగతి వరకు, యింకా అవకాశం వుంటే 8 వ తరగతి వరకు అభ్యసన మాద్యమం ఇంటి భాష/మాతృభాష/స్థానిక భాషలో ఉండాలని జాతీయ విద్యావిధానం 2019 ముసాయిదా పత్రం (4.5.1) లో ప్రతిపాదించబడింది. పిల్లల జీవితావసరానికి, భవిష్యత్తుకి ఆచరణయోగ్యం కాకపోయినా మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని ఏ చట్టంలోనూ, విద్యావిధానంలోనూ చెప్పలేదు. అందువలన అవసరమైతే ప్రాధమిక విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. సెకండరీ దశ నుండి ఇంగ్లీష్ మీడియంలోకి పోవచ్చు గానీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మాత్రం మాతృభాషలోనే ఉండాలనే వాదనతో లా భం లేదని ప్రభుత్వ ఉపాధ్యాయులే చెప్పారు. 2008-09 విద్యా సంవత్సరం నుండి సక్సెస్ స్కీమ్ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6500 హైస్కూళ్లలో ఆరవ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తే రెండేళ్లు గడిచే సరికే అలా కుదరదు అన్నారు. ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు ఆరో తరగతి నుండి ఇంగ్లీష్ మీడియంలోకి మారలేక పోతున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం ఉంటే ఒకటో తరగతి నుండే ఉండాలని సూచించారు. కొన్ని హైస్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం మూడేళ్ళ ముచ్చటగానే మూతబడింది. మాస్ మీడియా ప్రభావం మరియు మొబైల్స్ వాడకంతో ఇంటా బయటా ఇంగ్లీష్ పదాల వాడుక విస్తృతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా పిల్లలు మాతృభాషలోనే నేర్చుకో గలరని, ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకోలేరని చెప్పడం సబబు కాదు. తెలుగులో అయినా ఇంగ్లీషులో అయినా బోధించే సామర్ధ్యం, నైపుణ్యాన్ని బట్టి నేర్చుకోవడం సాధ్యమవుతుది. రాజ్యాంగ అధి కరణలు, విద్యావిధానాలు, కరిక్యులమ్ ఫ్రెమ్ వర్కులు మున్ నగు వాటిల్లో వుండే ఆదేశాలు,సూత్రీకరణలు, సూచనలు కంటే అందరికీ సమానంగా నాణ్యమైన విద్యను అందించాలనే విషయం అంగీకరించాల్సింది, ఆచరించాల్సింది. కానీ మన దేశ విద్యారంగంలో అనేక ఆసనమానతలు వున్నవి. వాటిలో మాధ్యమం చాలా ముఖ్యమైంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో 70 శాతం మంది ఇంగ్లీష్ మీడియంలో, 25 శాతం మంది తెలుగు మీడియంలో ఉండడం తీవ్రమైన అసమానత, అన్యాయం. అందరూ ఏదో ఒక మీడియంలో ఉంటేనే సమానత్వం, సమన్యాయం కాగలదు. ఇంగ్లీష్ మీడియంని ఎత్తేసి 70 శాతం మందిని తెలుగు మీడియంలోకి మార్చడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. తెలుగు మీడియంలో వున్న 25 శాతం మందిని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడమే సులభం. అయినా తెలుగు మీడియంలోనే తమ పిల్లలకు విద్య కావాలనే పేరేంట్స్ ఎంతమంది వున్నా వారి కోసం తెలుగు మీడియం పాఠశాలలను నడపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన వుంటుంది.
ఆంగ్ల మాద్యమం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడంతో పాటు హైకోర్టు ధర్మాసనం ఇంగ్లీష్ భాష పట్ల విముఖతను ప్రదర్శించడానికి కూడా ప్రయత్నించింది. 'ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మేగ్నా కార్టా' గా పిలువబడే 1854 ఉడ్స్ డిస్పాచ్ ఇండియాలో ఆంగ్ల విద్య వ్యాప్తికి పని చేసిందని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి అవసరమైన గుమాస్తాలను తయారు చేయడానికే ఇంగ్లీష్ మీడియంకి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. భారతీయ సంస్కృతిని దెబ్బతీసే అవకాశం వున్న ఆంగ్ల విద్యను మహాత్మా గాంధీ వ్యతిరేకించినట్లు చెప్పారు. సూద్రుల విద్య కోసం మరియు బాలికల విద్య కోసం ప్రముఖ సంఘ సంస్కర్తలు జ్యోతిరావు ఫూలే , సావిత్రిబాయి ఫూలే నిర్వహించిన పాఠశాలలను కూడా ఇంగ్లీష్ విద్య అమలుకు బ్రిటిష్ అధికారులు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. "ఆంగ్ల భాషతో కులమతాలను కూలగొట్టు; భట్-బ్రాహ్మణుల మంత్రాలను పారదోలు" అనే సావిత్రిబాయి ఫూలే యిచ్చిన సందేశం మాత్రం విస్మరించబడింది. @
నాగటి నారాయణ, సామాజిక విద్యావేత్త 9121047974
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి