1, మే 2020, శుక్రవారం

How 10 th Exams during Covid 19

పది విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ బదులుగా ప్రతిభా పరీక్ష
*****
కరోనా వైరస్ విజృంభణతో దేశంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. తెలంగాణలో ఇప్పటికే కొన్ని పరీక్షలు జరగగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలు స్థానిక ఎన్నికలు కారణంగా ఒకసారి, కరోనా వైరస్ తో మరోసారి వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ముప్పు తప్పి దేశంలో సాధారణ పరిస్థితులు రావడానికి మరి కొంత సమయం పట్టవచ్చు. ఇప్పుడున్న విధానంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, మూల్యాంకనం చేసి, ఫలితాలు ఇవ్వడానికి అధిక సమయం పడుతుంది. దీన్ని అధిగమించడానికి ఇటువంటి పరిస్థితుల్లో పది విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్ కు బదులు రెండువందల మార్కులకు ప్రతిభా పరీక్ష నిర్వహించటం మేలు. ఇందులో అన్నీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలుండేలా చూసి ఆబ్జెక్టివ్ రూపంలో ప్రశ్నాపత్రం ఇవ్వాలి. లేదా లాంగ్వేజెస్ కు ఒక పేపర్, గ్రూపులకు మరొక పేపర్ ఉండేలా ఏర్పాటు చేయడం మంచిది. ఇప్పటికే సి.బి.ఎస్.ఈ. పది, పన్నెండు తరగతులకు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. ప్రతిభా పరీక్ష నిర్వహించడం వల్ల సమయం ఆదా అవుతుంది. ఫలితాలను కూడా త్వరగా వెలువరించవచ్చు. ఫలితంగా విద్యా సంవత్సరం కూడా సకాలంలో ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాలు ఈ దిశగా చర్యలు చేపడితే మంచిది.
ఎం. రాం ప్రదీప్
తిరువూరు
9492712836

కామెంట్‌లు లేవు: