26, డిసెంబర్ 2020, శనివారం

Manu Smruti Dahan Diwas

 మనుస్మృతి దహనం మనందరి కర్తవ్యం 

                                                      నాగటి నారాయణ 
       రావణ దహనం, కామ దహనం గురించి చాలామందికి తెలుసు. వాటి వివరాలు అంతగా తెలియక పోయినా ఆ కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొంటారు. వివరాలు తెలిస్తే వాటికి అంతటి ప్రాధాన్యత వుండదు. కానీ మనుస్మృతి దహనం గురించి తెలుసుకోవడం, ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా కేంద్రంలో మనుస్మృతి ఆరాధికుల అసాధారణ పరిపాలన సాగుతున్నందున ఈ కార్యక్రమాన్ని సామాజిక, రాజకీయ కర్తవ్యంగా నిర్వహించాలి. దళితుల పట్ల, మహిళల పట్ల సామాజిక వివక్షతకు మూలమైన సైద్ధాంతిక భావజాలాన్ని చెరిపేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. 1927 డిసెంబర్ 25 న మహారాష్ట్రలోని కొంకణ్ తీరప్రాంతంలో గల మహద్ గ్రామంలో వేలాదిమంది వలంటీర్ల సమక్షంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతి గ్రంధం ప్రతులను దహనం చేశారు. ఆ సందర్బంగా వారందరూ చేసిన ప్రతిజ్ఞ: "చాతుర్వర్ణ వ్యవస్థను విశ్వసించను. కుల వ్యత్యాసాలను అంగీకరించను. హిందూ సమాజానికి శాపంగా వున్న అంటరానితనాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తాను. హిందువుల్లో ఆహారం,పానీయం విషయాల్లో ఎలాంటి నిషేధాలను పాటించాను. ఆలయాలు,నీటి వనరులు, పాఠశాలలు వగైరా సదుపాయాల విషయంలో అశ్ప్రుస్యులు అనబడే వారితోసహా అందరికీ సమాన హక్కులు వుంటాయని నమ్ముతున్నాను."  మనుస్మృతి గ్రంధాన్ని దహనం చేసే గుండం నలువైపులా ఎత్తుగా కట్టిన బ్యానర్లపైన మూడు నినాదాలు వ్రాశారు. అవి: మనుస్మృతి శ్మశానవాటిక; అంటరానితనం సమాధి; బ్రాహ్మణిజం ఖననం. శతాబ్ద కాలం గడుస్తుస్తున్నా ఆ మూడు నినాదాలు బ్యానర్లపైనా, కాగితాల పైనే వుండి పోయినవి. 
       మనుస్మృతి దహన కార్యక్రమంలో అంబేద్కర్ చేసిన అధ్యక్షోపన్యాసంలో "ఈ ఉద్యమం త్రాగు నీటి కోసం, ఆలయ ప్రవేశం కోసం మరియు యితర సదుపాయాల కోసమే కాదు, సమాజంలో అసమానతలకు హేతువైన వర్ణ వ్యవస్థను రూపుమాపడం కోసం చేస్తున్నాము" అని అన్నారు. ఆ కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో సమాన హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాల విశేషాలను సభికులకు విడమర్చి చెప్పారు. ఫ్రెంచి విప్లవంలో పెల్లుబికిన మానవ హక్కుల డిమాండులను పేర్కొన్నారు. రోమ్ లో పార్టీసియన్సుకి వ్యతిరేకంగా ప్లెబియన్సు చేసిన తిరుగుబాటులోని డొల్లతనాన్ని వివరించారు. సమాజంలోని విభజన వ్యవస్థను అంతమొందించకుండా తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఒక ట్రిబ్యూన్ ఏర్పాటు చేయాలనే డిమాండుతో ప్లెబియన్లు సాధించింది ఏమీ లేదని చెప్పారు. మౌలిక సమస్యలపై కేంద్రీకరించకుండా స్వల్పకాలిక, తాత్కాలిక సమస్యలకే పరిమితం కావడం వలన విముక్తి లభించదని బోధించారు. మా ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నాము, ఈ సామాజిక విప్లవానికి సహకరించండని అగ్ర వర్ణాలకు కూడా అంబేద్కర్ విజ్ఞప్తి చేశారు. శాస్త్రాలను వదిలేయండి, న్యాయాన్ని చూడండి అని హితవు పలికారు. మనుస్మృతి దహనం, మహద్ చెరువులోని నీరు తెచ్చుకోవడం సమస్య తీవ్రతను గుర్తింపచేసి, నిరసన వ్యక్తం చేసే సింబాలిక్ చర్యలు మాత్రమేనని, వాటి పరిష్కారానికి సుదీర్ఘ పోరాటం చేయాల్సి వుంటుందని అంబేద్కర్ దిశా నిర్దేశం చేశారు. 
       మనుస్మృతి వలన దళితులు అనుభవించిన అమానుష బానిసత్వం, సామాజిక అన్యాయం అందరికీ తెలిసిందే. దళితుల నివాసాలు ఉరికి కొద్ది దూరంలో వెలివాడలుగా వుండే విషయం ఇప్పటికీ షరా మామూలే. ఏదైనా పని మీద ఊళ్లోకి వచ్చే దళితుడి అడుగు జాడలు బజారులో పడకూడదు. అందుకోసం నడుముకు వెనక పొడవుగా గుబురుగా ఆకులు వుండే కొమ్మలను లేదా తాటి మట్టలను కట్టుకోవాలి. అవి వెనక నేలపై ఈడ్చుకొస్తూ పాదముద్రలను చెరిపేయాలి. ఊళ్ళో ఎక్కడా ఉమ్మి వేయకూడదు. అందుకోసం మెడలో చిన్న ముంత కట్టుకొని ఉమ్మి వచ్చినప్పుడు అందులోనే ఉమ్మాలి. దళితులు ఎలాంటి ఆయుధాలను వుంచుకోకూడదు, విద్య నేర్చుకోకూడదు, చదువుకోకూడదు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలకు, హత్యలకు గురికావాల్సిందే. స్వంతగా విలువిద్య నేర్చుకొన్న ఏకలవ్యుడి బొటనవేలును బలిగొన్న దుర్మార్గం ఒక ఉదాహరణ. దళితులతో పాటు ఏ వర్ణం వారైనా మహిళలు అందరూ మనుస్మృతికి బలి పశువులే. 
       'న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి" అనేది మనుస్మృతి ఆదేశం. బాలికగా తండ్రి రక్షణలో, మహిళగా భర్త రక్షణలో, విధవగా కొడుకు రక్షణలో వుండాలని కట్టడి చేస్తోంది. శారీరక బలహీనులైనా సరే భర్తలు భార్యలను నిత్యం తమ అదుపులో వుంచుకోవాలని చెబుతోంది. మహిళలు అపవిత్రులు, అబద్దాలాడతారు, తెలివిలేని వారు, బలహీనులు ... అందువలన వారు వేదాలు చదవలేరు. కనుక వారు నామకరణం చేయడం, జాతకాలు చెప్పడం, వేద మంత్రోచ్చారణలు చేయడం వంటివి చేయకూడదని అంటుంది. మహిళలను బానిసలుగా చూసే ఇలాంటివి చాలా వున్నవి. ఇవి చాలవా మనుస్మృతిని మంటగలపడానికి? అగ్ర వర్ణాలు, అందులోని పురుషులకే మనుస్మృతి సర్వాధికారాలు కల్పించింది. బ్రాహ్మణ పురుషుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాల మహిళలను పెళ్లి చేసుకోవచ్చు. అలాగే క్షత్రియ, వైశ్య పురుషులు తమ కులంలోని మరియు కింది కులాల్లోని మహిళలను పెళ్లి చేసుకోవచ్చు. కానీ శూద్ర కులం పురుషులు మాత్రం వారి కులంలోని స్త్రీలనే చేసుకోవాలి. ఏ కులంలోని పురుషులైనా తమకంటే పై కులంలోని స్త్రీలతో శారీరక సంబంధం కలిగితే అలాంటి వారు మరణ శిక్షార్హులవుతారు. ఇక దళితులను మనుషులుగానే చూడలేదు గనుక వారి హక్కులు గురించి మనుస్మృతి పూర్తిగా విస్మరించింది. 
       ఏ సామాజిక సమస్యల పరిష్కారం కోసం 93 సంవత్సరాల క్రితం అంబేద్కర్ నాయకత్వంలో మనుస్మృతి దహనం చేయబడిందో ఆ సమస్యలు యిప్పటికీ సజీవంగానే వున్నవి. అవి యింకా తీవ్రమవుతున్నవి కూడాను. దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగినవి. జాతీయ క్రైమ్ రికార్డ్సు బ్యూరో నివేదిక ప్రకారం బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ తదితర తొమ్మిది రాష్ట్రాల్లోని మొత్తం కేసుల్లో 84% ఎస్.సి. కులాలపైన మోపబడినవే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 'లవ్ జిహాద్' పేరుతో చేస్తున్న చట్టాలు కింది కులాల యువకులు పై కులాల యువతులను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా నిషేధించడం కోసమే. తెలుగు రాష్ట్రాల్లో పై కులాల అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకొన్న నిమ్న కులాల యువకులను హత్యలు చేస్తున్న విషయం తెలిసిందే. 2019 లో దేశంలో సగటున రోజుకి 88 చొప్పున మహిళలపై మానభంగాలు జరిగినట్లు ఎన్సీఆర్బీనే ప్రకటించింది. చిన్న అమ్మాయిలను కూడా సామూహికంగా బలాత్కరించి చంపేయడం జరుగుతోంది. ఇవన్నీ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలే కాదు. దళితులు, మహిళలు, బలహీన వర్గాల వారిని అనుభవించవచ్చు, అణిచివేయవచ్చు, హత్యలు చేయవచ్చని మనుస్మృతిలోనే వున్నది. అది భారతీయ సమాజంలో అగ్ర కులాల్లోని అత్యధికుల్లో ఆవహించి వుంది. అలాంటి అహంభావాన్ని అంతం చేయడం కోసమే మనుస్మృతి దహన కార్యక్రమాన్ని విస్తృతంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఇది దళితులకు సంబంధించిన కర్తవ్యమే కాదు... మహిళలు, మైనారిటీలు, బలహీన వర్గాలు, కులాలతో నిమిత్తం లేకుండా అభ్యుదయ కాముకులు అందరి కర్తవ్యంగా గుర్తించాలి. 
- నాగటి నారాయణ, సామాజిక విద్యావేత్త 9490300577

Uncertain on Schools Reopen

 బడి గంటలు మోగే వేళ?

                                   నాగటి నారాయణ 
       అక్టోబర్ 15 నుండి పాఠశాలలు, కళాశాలలను తెరవొచ్చని కేంద్ర ప్రభుత్వం అన్లాక్ గైడ్లైన్సు 5.0 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి యిచ్చింది. షరతులు వర్తిస్తాయని కూడా చెప్పింది. కోవిడ్-19 ప్రోటోకాల్ నిబంధనలకు తోడు కేంద్ర విద్యాశాఖ యిచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్సు (ఎస్ఓపీ)తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైన నిబంధనలు నిర్ణయించుకుని నిర్వహించుకోవాలని సూచించింది. తమ పిల్లలను స్వచ్చందంగానే బడికి పంపుతున్నట్లు, ఒకవేళ కరోనా సోకినా ఎవరినీ బాధ్యులను చేయమని పేరెంట్సు అంగీకార పత్రాలు యివ్వాలనే నిబంధన విధిగా పాటించాలని హెచ్చరించింది. రెండు నెలల తర్వాత డిసెంబర్ మధ్య నాటికి పరిస్థితిని పరిశీలిస్తే ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ 13 రాష్ట్రాల్లోనే పాఠశాలలను పాక్షికంగా తెరిచినట్లు, విద్యార్థుల హాజరు చాలా పరిమితంగా (సగటున 10-30 శాతం) వున్నట్లు  తెలుస్తోంది. మిగిలిన రాష్ట్రాలు చర్చోపచర్చలతో మల్లగుల్లాలు పడుతున్నవి. తెలంగాణ కూడా అదే విధంగా శోచాయిస్తోంది. కర్ణాటకలో ఇంజనీరింగ్ కాలేజీల్లోనే విద్యార్థుల హాజరు ఐదు శాతం మాత్రమే వున్నందున పాఠశాలల పునఃప్రారంభం విషయాన్ని డిసెంబర్ మొదటి వారంలో పరిశీలిద్దామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఎస్.ఎడ్యూరప్ప చెప్పారు. హర్యానాలో 9-12 తరగతులను డిసెంబర్ 21 నుండి ప్రారంభించాలని, కోవిడ్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తెచ్చిన విద్యార్థుల వరకే అనుమతించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యిచ్చిన ఓక సర్కులర్ ద్వారా తెలిసింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాల వత్తిడి మేరకు డిసెంబర్ 15 నుండి పాఠశాలలు తెరిచేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు పాఠశాలలు ప్రారంభించేది లేదని ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. కరోనా వ్యాధి తగ్గేదాకా బడి తలుపులు తెరిచేది లేదని పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్ధ ఛటర్జీ చెప్పారు. డిసెంబర్ నెలాఖరు వరకు విద్యాసంస్థలు పని చేసే అవకాశం లేదని రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ప్రకటించాయి. డిసెంబర్ రెండో వారం నుండి బడి తలుపులు తెరుస్తామని గతంలో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్య సంచాలకులు ఏ. శ్రీదేవసేన, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోసం వేచియున్నామని చెప్పినట్లు పత్రికల ద్వారా అందిన సమాచారం. 
             డిజిటల్ డివిజనుగా సరికొత్త అసమానత 
       పాఠశాలల్లో భౌతికంగా విద్యాబోధన జరిగే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ క్లాసుల ట్రెండ్ వచ్చేసింది. దానితో పాఠశాల విద్యలో నెలకొన్న అనేక అసమానతలకు తోడు డిజిటల్ డివిజన్ సరికొత్త సమస్యగా తలెత్తింది. ఈ విభజన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల మధ్య అసమానతకే పరిమితం కాకుండా ప్రైవేట్ పాఠశాలల మధ్య, వాటిలోని విద్యార్థుల మధ్య కూడా అసమానతకు దారి తీసింది. కొన్ని కార్పొరేట్ స్కూల్సు మరియు సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు మాత్రమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించినవి. అవి కూడా ఫీజులు చెల్లించిన విద్యార్థులకు మాత్రమే ఆన్లైన్ క్లాసులతో నేర్చుకొనే అనుమతి యిచ్చినవి. తక్కువ ఫీజులు తీసుకొనే బడ్జెట్ పాఠశాలలు రికార్డ్ చేసిన పాఠాలను సోషల్ మీడియా ద్వారా అందించినవి తప్ప ఆన్లైనులో లైవ్ క్లాసులు నిర్వహించలేకపోయినవి. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని సకల సౌకర్యాలు, డిజిటల్ బోధనలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు గల కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఏదో ఒక మేరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించినవి. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దక్కింది టీవీ పాఠాలు మరియు కొంతమంది హైస్కూల్ విద్యార్థులకు వాట్సాప్ సందేశాలు మాత్రమే. వాటిని కూడా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అందుకోలేక పోయారనే విషయం తెలిసిందే. మరోవైపు పీజీలు కట్టే స్తోమతు లేని ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు మానసికంగా నలిగిపోయారు. మొత్తమ్మీద డిజిటల్ లెర్ణింగ్, ఆన్లైన్ క్లాసులు, వాట్సాప్ పాఠాలు ద్వారా 30% మంది విద్యార్థులు మాత్రమే ఎంతోకొంత నేర్చుకున్నారని 'యాన్వల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (అసెర్)' ద్వారా తెలిసింది. అవన్నీ కాలక్షేప కార్యక్రమాలే తప్ప వాటితోనే సిలబస్ పూర్తయినట్లు పరిగణించే అవకాశం లేదు. అందువలన ఏడు నెలల కాలం గడిచినా 2020-21 విద్యా సంవత్సరం అనిశ్చిత స్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది. 
            ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన లోపం 
       పాఠశాల విద్యను అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు మరియు ఎస్ఓపీ లను పాటిస్తూ, బడి తలుపులు తెరిచి "ఏమీ ఫర్వాలేదు, పిల్లలను పంపండి, కరోనా సోకితే ప్రభుత్వమే వైద్యం చేయిస్తుంది" అనే భరోసా యివ్వగలిగితే తల్లిదండ్రులు స్పందించగలరు. కరోనా విపత్తులో తగిన జాగ్రత్తలతో పాఠశాలలు నిర్వహించాలంటే ఒక్కో విద్యార్థి నుండి అదనంగా ఐదు వందల రూపాయలు చొప్పున ఫీజు వసూలు చేయాల్సి వస్తుందని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు గతంలోనే ప్రకటించినవి. ధర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్, సోషల్ డిస్టెన్సు, మంచి నీరు, మధ్యాహ్న భోజనం, కోవిడ్ టెస్టులు వగైరా అవసరాలకు తగిన నిధులు యివ్వకుండా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడం చాలా కష్టం. ఒకవేళ జనవరి రెండో వారం నుండైనా పాఠశాలలను పునఃప్రారంభిస్తే విద్యా సంవత్సరం ఎప్పటికి ముగిస్తారనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించాలి. ఈ ప్రత్యేక పరిస్థితిలో 220 రోజులు నడిపించలేకపోయినా, అందులో సగం రోజులైనా అదనపు పని గంటలతో నిర్వహించి, కొంత సిలబస్ తగ్గించుకొని విద్యా సంవత్సరాన్ని రీషెడ్యూల్ చేయవచ్చు. ఈసారి విద్యా సంవత్సరం ముగింపు మరియు పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయాలను రాష్ట్రాలు కేంద్రంతో కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం వున్నది. సీబీఎస్ఈ పదో తరగతి మరియు పన్నెండో తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహించడానికి షెడ్యూల్ యివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పరిస్థితిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షను మార్చిలో కాకపోతే మీ నెలలో అయినా నిర్వహించేందుకు అనువుగా క్లాసులు నిర్వహించాలి. సిలబసుతో పాటు పరీక్ష పత్రాలను కూడా తగ్గించాలి. 1-9 తరగతులకు వేసవి సెలవులు లేకుండా జూలై వరకు తరగతులు నిర్వహించి విద్యా సంవత్సరాన్ని భర్తీ చేయవచ్చు.  @ 
నాగటి నారాయణ, సామాజిక విద్యావేత్త 6460300577

26, నవంబర్ 2020, గురువారం

BJP Attacking Love Marriages

 ప్రేమ-పెళ్లి పైన ప్రభుత్వ పెత్తనం?

                                          నాగటి నారాయణ 
       "మధ్యప్రదేశ్ ధర్మ స్వతంత్ర విధేయక్ 2020" పేరుతో శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక బిల్లును తయారు చేసినట్లు, దానిని అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించనున్నట్లు ఆ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి నరోత్తం మిశ్రా యిటీవల మీడియాకు చెప్పారు. ఆ పార్టీకి అసెంబ్లీలో గల బలంతో బిల్లు ఆమోదం పొందడం, చట్టంగా మారడం లాంఛనమే. ఉత్తర ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అస్సాం మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి చట్టాలనే చేయడానికి పోటీ పడుతున్నవి. అసెంబ్లీకి పోయే దాకా ఆగలేని ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఈ నెల 24న ఒక ఆర్డినెన్సును ఆమోదించింది. బిజెపి ప్రభుత్వాలు తెచ్చిపెడుతున్న ఈ సామాజిక సమస్య మత సామరస్యతకు, దేశాభివృద్ధి కి సరికొత్త సవాలుగా  మారనున్నది. 
       యూపీ ఆర్డినెన్సులో మరియు ఎంపీ బిల్లులో నిబంధనలు చాలా ఆందోళనకరంగా వున్నవి. ప్రభుత్వానికి తెలియకుండా చేసుకునే ముస్లిం-హిందూ వివాహాలను లవ్ జిహాద్ గానే పరిగణిస్తారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టి పది సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. పెళ్లి చేసుకోదలిచిన ముస్లిం-హిందూ జంట రెండు నెలలు ముందుగా సంబంధిత జిల్లా కలెక్టర్/మేజిస్ట్రేట్ కి దరఖాస్తు చేసుకోవాలి. "మత మార్పిడి లేకుండానే పెళ్లి చేసుకుంటాము" అని హామీ యివ్వాలి. సదరు హామీ పత్రం పైన ఇరు మతాల పెద్దలు కూడా సంతకాలు చేయాలి. అలాంటి దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్ వారు పబ్లిక్ గా ప్రకటిస్తారు. ఇష్టపడిన వారు పెళ్లి చేసుకునే విషయాన్ని బహిరంగంగా ప్రకటించేలా? అది వ్యక్తుల స్వేచ్చా, స్వాతంత్య్రాలను హరించడం కాదా? అలా బహింగంగా ప్రకటించబడిన జంటలను లవ్ జిహాద్ ను అరికట్టేందుకు సంఘ పరివార్ నియమించిన ప్రైవేట్ సైన్యం నిఘా వేసి వెంటాడుతుంది. 
       ప్రేమ అనేది సహజమైన విషయం. నచ్చిన వారిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం మానవ నైజం. సహజమైన, ప్రకృతిపరమైన ఈ నియమాన్ని బీజేపీ సహించదు. ఆ పార్టీ పెద్దలు ప్రచారం చేసే పురాణాల్లో మరియు పునరుద్దరించాలని చెబుతున్న వేద కాలంలో ప్రేమ వివాహాలను కీర్తించడం జరిగింది.ఆ మాటకొస్తే శకుంతల దుష్యంతుల గాంధర్వ (ప్రేమ) వివాహం వల్లనే మన దేశానికి భారత దేశం అనే పేరు వచ్చిందనే ప్రచారం తెలిసిందే. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు చాలామంది వుండవచ్చు. కానీ వర్ణాశ్రమ ధర్మం పేరుతో సవర్ణ వివాహాలకే పరిమితం చేయడం హిందుత్వ శక్తులు చేస్తున్న పని. హిందూమతం రక్షణ పేరుతో మతాంతర వివాహాలను వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమించి పెళ్లి చేసుకుంటే దానిని "లవ్ జిహాద్" అనే ముద్ర వేసి దాడి చేస్తున్నారు. ముస్లిం-హిందూ వివాహాలు మత మార్పిడి కోసమే జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అలాంటి వివాహాలను నిషేధించాలని కోరుతూ వేసిన పిటిషన్ ని తిరస్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు మత మార్పిడుల కోసమే పెళ్లి చేసుకొంటున్నారనే ఆరోపణ సరైందికాదని, నిరాధారమైందని కొట్టేసింది. ముస్లింలు హిందువులను పెళ్లి చేసుకునే కేసుల్లో కుట్ర గానీ, విదేశీ నిధుల ప్రమేయం గానీ లేవని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన 'స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)' తేల్చింది. అయినా "లవ్ జిహాద్" ముద్ర వేసి ముస్లిం-హిందూ వివాహాల నిషేదానికి ఆర్డినెన్సు తెచ్చింది. 
       అభివృద్ధి చెందిన దేశాల్లో 'ఇంటర్ ఫెయిత్' (వివిధ మత విశ్వాసుల మధ్య) వివాహాల పట్ల అంతగా ఆంక్షలు లేవు. కొన్ని వున్నా చెప్పుకోదగినంతవి కావు. ప్రపంచీకరణ యుగంలో దేశాల మధ్య, ఖండాల మధ్య అంతరాలు తొలగిపోతూ అన్ని విషయాలు లిబరల్ (సరళీకరణ) అవుతున్న నేపథ్యంలో వివాహాల మధ్య విశ్వాసాల గోడలు నిర్మించడం తగని పని. సార్వత్రిక మానవ హక్కుల డిక్లరేషన్ ఆర్టికిల్ 16 ప్రకారం జాతి, మతం, తెగ పరిమితులతో నిమిత్తం లేకుండా మేజర్ అయిన పురుషులు, స్త్రీలు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం ఆర్టికిల్ 21 వ్యక్తిగత జీవితానికి, జీవన భద్రతకు భరోసా యిస్తుంది. మత ఆచరణ, మత ప్రచారం చేసుకునే హక్కును అనుమతించిన ఆర్టికిల్ 25 వివిధ మతస్థుల మధ్య వివాహాలను నిషేధించలేదు. అందువలన లవ్ జిహాద్ పేరుతో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనవి. రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తామని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడడం బీజేపీ రాజకీయ విధానం. ఆ వైఖరినే దేశ భక్తిగా చెప్పుకుంటోంది. 
       మతాంతర వివాహాలను నిషేధించడం వలన వ్యక్తుల స్వేచ్చా స్వాతంత్య్రాలకు మరియు ఇష్టాయిస్తాలకు విఘాతం కలగడమే కాదు, మత సామరస్యానికి మరియు దేశ అభివృద్ధికి కూడా నష్టమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితాలు ఆనందంగా, ఆరోగ్యంగా వుండే అవకాశం వుంది. వారికి కలిగే సంతానం కూడా జన్యుపరమైన సమస్యలు లేకుండా శారీరకంగా, బౌద్ధికంగా ఎదిగే అవకాశాలు ఎక్కువ. ఇద్దరూ ఇష్టపడి పరస్పరం అర్ధం చేసుకుని పెళ్లి చేసుకున్న వారు ఒకరి మత విశ్వాసాలను ఒకరిపై రుద్దాలనే పట్టుదల పెద్దగా వుండదు. తమ మతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటాననే వారు కూడా తమ పెద్దల వత్తిడి వలన ఆ విధంగా చేస్తుంటారు. కుటుంబ సభ్యులు, మత పెద్దల అదుపు ఆజ్ఞలు లేకపోతే యువతీ వయువకులు మరింత స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించే అవకాశం కలుగుతుంది. పెద్ద మతాల వారే పెద్ద మనసుతో చిన్న మతాల వారిని ఒప్పించే కృషి చేయాలి తప్ప అడ్డుగోడలు నిర్మించడం సరైందికాదు. ఇప్పటికే భారత దేశంలో మైనార్టీ మతాలకు రక్షణ లేదనే అపవాదు వున్నది. ఇలాంటి చట్టాలు చేయడం ద్వారా అది మరింత బలపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఆ విషయం కొన్ని దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేయవచ్చు. అంతర్జాతీయ సమాజానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా దాపురిస్తుంది. @ 
నాగటి నారాయణ, సామాజిక విశ్లేషకులు 9490300577


22, నవంబర్ 2020, ఆదివారం

Govt discrimination towards Teachers!

 *ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ వివక్షత తప్పు*

     _జేఏసీ పూర్వ కో-చైర్మన్ నాగటి నారాయణ_

      జిహెచ్ఎంసి ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులను విస్మరించడం ప్రభుత్వానికి తగని పని. వృత్తి రీత్యా నిజాయితీగా వుండే ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో అయినా, సంక్షేమ పథకాల అమల్లో అయినా నిజాయితీగా పనిచేస్తారనే పేరుంది. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కానప్పుడు అసంతృప్తి చెంది నిరసన వ్యక్తం చేయడం, ఆందోళన పోరాటాలు చేయడం కూడా నిజాయితీకి సంబంధించిన విషయాలే. "మా డిమాండ్లు ఒప్పుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడిస్తాం" అనే అంతటి తీవ్రమైన రాజకీయ ప్రకటనలు కూడా ఇతరుల్లాగా చేయరు. ఏ ఎన్నికల్లో అయినా ఓటు ఎవరికి వేస్తారనేది వారి వ్యక్తిగత వ్యవహారమే తప్ప వృత్తి పరమైంది కాదు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇవ్వాలని టీఎన్జీవో, టీజీఓ సంఘాలు ఏకపక్షంగా ఇచ్చిన పిలుపును తిరస్కరించడమే ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వివక్షతకు పరోక్ష కారణమైతే, అది మరీ తప్పిదం అవుతుంది. ఒకవైపు బిజెపి మతోన్మాదం ముంచుకొస్తున్న సమయంలో రాష్ట్రంలోని అధికార పార్టీ ఉపాధ్యాయులను దూరం చేసుకోవడం మంచిది కాదు.

 *నాగటి నారాయణ*, జేఏసీ పూర్వ రాష్ట్ర కో-చైర్మన్

ది. 22-11-2020.

9, ఆగస్టు 2020, ఆదివారం

By-Lingual Media Better

 తెలుగు, ఇంగ్లీష్ చాలు; సంస్కృతం ఎందుకు?

                                                          నాగటి నారాయణ 

       నూతన జాతీయ విద్యా విధానం 2020 లో మాద్యమం మరియు భాషల విషయములో రాష్ట్రాలకు స్వేచ్ఛ లభించింది. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోగలిగితే తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం ముఖ్యంగా పాఠశాల విద్య కొత్త పుంతలు తొక్కే అవకాశం కలుగుతుంది. పేరా 4.11 లో "సాధ్యమైన చోట, 5వ తరగతి వరకు, అవకాశం వుంటే 8వ తరగతి దాకా, ఆ తర్వాత కూడా విద్యా మాధ్యమంగా ఇంటిభాష/ మాతృభాష/ స్థానిక భాష/ ప్రాంతీయ భాషలో అమలు చేయాలి" అని సూచించబడింది. పేరా 4.13 లో "త్రిభాషా సూత్రం కొనసాగించబడుతుందని, ఏ మూడు భాషలు అనేది ఆయా రాష్ట్రాలు/ ప్రాంతాల యిష్టం మరియి విద్యార్థుల అభీష్టం. అయితే మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలై ఉండాలి" అని సూచించడం జరిగింది. కానీ పేరా 4.17 లో "మూడు భాషల్లో ఒకటిగా సంస్కృతమును స్వీకరించాలి" అని చెప్పబడింది. 

       ఈ విధానం ప్రకారం వివిధ పాఠశాలల్లో అమల్లో వున్న విద్యా మాధ్యమాలు యధాతధంగా కొనసాగవచ్చు లేదా మార్చుకోదలిస్తే మార్చుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు మరియి సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమాలే కొనసాగుతాయని కేంద్ర విద్యాశాఖ అధికారులు చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, మోడల్ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లో వున్న ఇంగ్లీష్ మీడియం కొనసాగడానికి అభ్యంతరం ఏమీ లేదు. విద్యార్థుల అభీష్టం అంటే తల్లిదండ్రుల అప్షనే గనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాల్లో ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియంను నిస్సంకోచంగా అమలు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా తల్లిదండ్రుల కోరిక మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాల్సి వుంటుంది. కానీ తెలుగు మాధ్యమంలోనే చదివించాలనుకునే తల్లిదండ్రుల కోరికను అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన వుంటుంది. 2-8 సంవత్సరాల లేత వయసులోనే పిల్లలు ఏ భాషను అయినా సులభంగా నేర్చుకోగలరని పరిశోధనల్లో తేలిందని పేరా 4.12 లో పేర్కొనబడింది. సైన్సు, గణితం పాఠ్య పుస్తకాలను ఇంటి భాష/ మాతృ భాష మరియు ఇంగ్లీషులో మంచి అందంగా నాణ్యముగా ప్రచురించి సమర్ధవంతంగా బోధించగలిగితే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేరా 4.14 లో వున్నది. అందువలన ఈ సరికొత్త సూత్రీకరణలు, సూచనలను తెలుగు రాష్ట్రాలు తమకు అవరమైన మేరకు సరిగా అన్వయించుకుంటే పాఠశాల విద్యలో విప్లవాత్మకమైన మార్పు రాగలదు. 

       ఎనిమిదో తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు భాషలు నేర్పితే చాలు. భారతదేశంనకు పరిపాలనా పరంగా ఐక్యత, సమగ్రత బ్రిటిష్ పాలనా కాలంలోనే సమకూరింది. దాదాపు వందేళ్లపాటు భారతీయ భాషలతో కలిసి పరిపాలనలో, కమ్యూనికేషన్ లో ప్రజలను ఆవహించిన భాషను విస్మరించడం సాధ్యం కాదు. 72 సంవత్సరాల స్వపరిపాలన కూడా దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న చట్టాలు, న్యాయస్థానాల్లో ఇంగ్లీష్ భాషే ప్రధానమైంది. 1980 ల నుండి ప్రపంచాన్ని ఆవహించిన సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో ఇంగ్లీష్ అవసరం బాగా పెరిగింది. ప్రపంచ అనుసంధాన భాషగా అలరారుతోంది. అందువలన ఇంగ్లీష్ భాష పట్ల, ఇంగ్లీష్ మీడియం పట్ల ప్రజల ఆకాంక్షను అర్ధం చేసుకోవాలి. అన్ని విషయాల్లో లిబరల్ గా వ్యవహరిస్తున్నట్లే మీడియం విషయంలో కూడా లిబరల్ గా వుండవచ్చు. ఈ విషయం నూతన విద్యా విధానంలో కూడా వుందనే విషయాన్ని గుర్తించాలి. భాషేతర సబ్జెక్టులు అయిన సైన్సు, గణితం లను తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో మేళవించి ద్విభాషా మాధ్యమం  (బైలింగ్వల్ మీడియం) గా బోధించాలి. నార్వే, స్కాండినేవియా మరియు కొన్ని ఆఫ్రికా దేశాల్లో బైలింగ్వల్ మీడియా అమల్లో వుంది. మరాఠా మాధ్యమం గల మహారాష్ట్రలోని మెజారిటీ స్కూళ్లలో మాత్సు, సైన్స్ సబ్జెక్ట్ లను మరియు హిందీ మాధ్యమం గల ఉత్తరాఖండులోని 15 వేల పాఠశాలల్లో సైన్స్ సబ్జెక్ట్ ను ఇంగీషులో బోధిస్తున్నారు. అది కూడా ద్విభాషా మాద్యమమే అవుతుంది. భౌగోళిక, సామాజిక, ఆర్ధిక, పరిపాలనా పరమైన విషయాలకు సంబంధిచిన సాంఘిక శాస్త్రంను తెలుగులోనే బోధించాలి. ఎలిమెంటరీ లెవెల్లో రెండు భాషలు, మూడు భాషేతర మొత్తం ఐదు సబ్జెక్టులకే పరిమితమైతే విద్యార్థులపైన భారం కూడా తగ్గుతుంది. 

       మూడు భాషల్లో ఒకటిగా సంస్కృతము వుండాలని చేసిన సూచనను పాటించాల్సిన అవసరం లేదు. కమ్యూనికేషన్ కి గానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలకు గాని ఉపయోగపడని సంస్కృత భాషను పాఠశాల స్థాయిలో నేర్పడం ఎందుకు? 2011 జనాభా లెక్కల్లో 24,852 (0.00198) మంది మాత్రమే మాతృభాషగా చెప్పుకున్న అత్యంత మైనార్టీ భాషకు అంత ప్రాధాన్యత యివ్వడం బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసం తప్ప విద్యార్థులకు ఏమి ప్రయోజనం? భారతీయ సమాజానికి అత్యంత అవమానకరమైన అంటరానితనంను, కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్న మనువాద సనాతన సంస్కృతిలో భాగమైన భాషను నేర్పితే సమాజానికే నష్టం. విద్యార్థుల భవిష్యత్తుకు, జీవితానికి తోడ్పడని విద్యా విధానంలోని ఏ అంశాన్ని అయినా అమలు చేయకుండా వదిలివేసే స్వేచ్ఛ రాష్ట్రాలకు వుంటుంది. తమిళనాడు రాష్ట్రంలో 1968 నుండి రెండు భాషల (తమిళం, ఇంగ్లీష్) విధానమే అమల్లో వున్న విషయం తెలిసిందే. ఆమాటకొస్తే హిందీ రాష్ట్రాల్లో మూడో భాషగా హిందీయేతర రాష్ట్రాల్లోని ఏదో ఒక భాషను బోధించాలనే త్రిభాషా సూత్రంను హిందీ రాష్ట్రాలు కూడా అమలు చేయడం లేదు. మూడో భాషగా సంస్కృతం అమల్లో వుంది. హిందీయేతర రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ఆయా రాష్ట్రాల్లోని అధికార భాషను విస్మరించి సెకండరీ స్థాయిలో సంస్కృత భాషనే అమలు చేస్తున్నారు. అందుచేత తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషలు చాలు. తాజా విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని కూడా అమలు చేసేది లేదని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ విద్యా విధానంలో వదిలివేయబడిన హిందీ భాషను బోధించాల్సిన అవసరమూ లేదు. మే నెల 31న ప్రకటించిన ముసాయిదా విధాన పత్రంలోని త్రిభాషా సూత్రంలో సూచించిన హిందీ భాషను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు వ్యతిరేకించడంతో రెండు రోజుల్లోనే ఆ వాక్యాన్ని మార్చేసి హిందీని అప్షనల్ సబ్జెక్టుగా పెట్టారు.  ఆమోదించిన పత్రంలో హిందీ మాటే లేకుండా చేశారు. విద్యారంగంలో బీజేపీ అనుసరిస్తున్న సంకుచిత రాజకీయ అవకాశవాద ధోరణికి అదొక నిదర్శనం. 

నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త 9490300577

30, జూన్ 2020, మంగళవారం

Online Inevitable NN

అవసరం మేరకే ఆన్లైన్ విద్య 
                                        నాగటి నారాయణ 
       పాఠశాల విద్యలో ఆన్లైన్ క్లాసుల అలజడి జరుగుతోంది. దూరవిద్యా విధానంలో కొన్ని రోజులే క్లాస్ రూములో నేర్చుకొని, ఎక్కువ రోజులు ఇంట్లోనే బుక్స్, స్టడీ మెటీరియల్ చదువుకుని, పరీక్షలు వ్రాసి డిగ్రీ, డిప్లమో సర్టిఫికెట్లు పొందుతున్న విషయం చాలా కాలంగా వున్నదే. ఇప్పుడు కొన్ని రోజులు కూడా క్లాసు రూముకి పోకుండా ఇంట్లోనే కూర్చుని, ఏదో ఒక వృత్తి ఉద్యోగంలో వున్నవారు కూడా ఆన్లైనులో చదువుకుంటూ వివిధ రకాల కోర్సులు పూర్తిచేయడం ఉన్నత విద్యలో జరుగుతోంది. కాగా కరోనా వైరస్ భయంతో విద్యారంగంలో ఏర్పడిన ప్రతిష్టంభన పరిస్థితిలో పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల అవసరం ముందుకొచ్చింది. సీబీఎస్ఈ  అనుబంధ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఆన్లైన్ క్లాసుల నిర్వహణ చాలా రోజుల నుండి జరుగుతోంది. రాష్ట్ర సిలబసుతో నడుస్తున్న కొన్ని పెద్ద ప్రైవేట్ స్కూళ్ళు కూడా అదే పని చేస్తున్నవి. ఆన్లైన్ పేరుతొ అదనంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నవి. ఫీజుతో పాటు స్మార్ట్ ఫోనులు, ల్యాప్ టాప్, కంప్యూటర్, వైఫై, డేటా వంటి అదనపు ఖర్చుల భారం తల్లిదండ్రుల పైన పడుతోంది. పాఠం చెప్పడం, నోట్సు వ్రాయించడం, హోమ్ వర్క్ చేయించడంతో ప్రైమరీ క్లాసుల పిల్లలనే రోజుకి 6-7 గంటలు వేధించడం జరుగుతోంది. సెకండరీ క్లాసుల విద్యార్థులు రోజుకి 10-12 గంటలు ఆన్లైనుతో అవస్థ పడుతున్నారు. గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉండడం వలన విద్యార్థులకు కంటి చూపు మందగించడం, నడుము నొప్పి వంటి శారీరక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ అభ్యసన జరుగుతున్నంతసేపు తల్లి/తండ్రి లేదా ఎవరో ఒక పెద్ద వారు వారి పని మానేసి పిల్లలకు తోడుగా ఉండాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలున్నాయని ఇటీవల బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వమే చూడాలని ధర్మాసనం వదిలేసింది. అదనపు ఖర్చలు భరించి ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం బడ్జెట్ స్కూళ్లకు సాధ్యం కాదని 'తెలంగాణ రికగ్నైజుడ్ స్కూల్స్ మేనేజర్స్ అసోసియేషన్ (ట్రస్మా)' నాయకులు ప్రకటించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదివే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఊసే లేదు. కొంతమందికే ఆన్లైన్ విద్య అందుతూ ఎంతోమందికి అలాంటి అవకాశం లేకపోవడం వలన విద్యారంగంలో సరికొత్త విభజన, అసమానత సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో బడి పిల్లలకు ఆన్లైన్ విద్య అవసరమా? అయితే ఎంతమేరకు అనేది చర్చనీయాంశం. 
       కోవిడ్-19 కొనసాగుతుండడం వలన 2020-21 విద్యాసంవత్సరం అనిశ్చితంగా మారింది. ఆగస్టు 15 వరకు పాఠశాలలు ప్రారంభించే అవకాశం లేదని కేంద్ర విద్యాశాఖామాత్యులు రమేష్ కుమార్ పోఖ్రియాల్ గతంలోనే ప్రకటించారు. జూలై నెలాఖరు దాకా పాఠశాలలు, కళాశాలలు తెరవొద్దని, అప్పటివరకు ఆన్లైన్/ దూరవిద్య విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని, ప్రత్సాహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 2 సందర్బంగా ప్రకటించింది. కేంద్ర విద్యాలయాలు, సీబీఎస్ఈ ఎఫిలియేటెడ్ స్కూల్స్ ప్రారంభించకుండా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించే అవకాశం లేకపోవచ్చు. గత విద్యాసంవత్సరాన్ని నెల రోజులు ముందుగానే ముగించాల్సి వచ్చింది.  ఎకడమిక్ షెడ్యూల్ ప్రకారం జూన్ రెండో వారంలోనే పాఠశాలలు ప్రారంభించాల్సి వుంది. ఆగస్టు 15 దాకా ఆగాలంటే రెండు నెలల కాలం విద్యార్థులు చదువుకోకుండా ఖాళీగా వుండాలంటే కష్టమే. అందువలన ఆన్లైన్లో విద్యాభ్యాసాన్ని నడిపించాలనే కొన్ని పాఠశాలల కృషిని తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు. కాకపోతే అదనపు ఫీజుల భారం మోపవద్దని, గంటల తరబడి పిల్లలను వేధించవద్దని, ఆన్లైన్లో అభ్యసన ప్రక్రియ విద్యార్థులకు ఆనందంగా, ఆహ్లాదకరంగా వుండాలని కోరుకొంటున్నారు. అయితే కొన్ని పాఠశాలలే ఆన్లైన్లో పాఠాలు చెబుతూ సిలబస్ కవర్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంటే కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను ఆ పాఠశాలల్లోనే చేర్చే అవకాశం వుంటుందని బడ్జెట్ స్కూళ్ల మేనేజర్లు ఆందోళన చెందుతున్నారు. అందువలన ఆన్లైన్ విద్యాబోధన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలోనూ అమలు జరిగే విధానం కావాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ కొంత ప్రయత్నం చేస్తోంది. ప్రాధమిక (1-8) తరగతులకు ఎన్సీఈఆర్టీ రూపొందించిన "ఆల్టెర్నేటివ్ ఎకడమిక్ కేలండర్" ని యిటీవల విడుదల చేసింది. సెకండరీ లెవెల్ క్లాసుల కేలండర్ కూడా రావాల్సి వుంది. ఆ కేలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు అనువుగా మలుచుకొని అమలు చేయాల్సి వుంటుంది. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రణాళికను మించి అతిగా వ్యవహరించే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించాలి.  రెండు నెలలు ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభించాల్సి వున్నందున ఆ మేరకు 30% సిలబసును తగ్గించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. అయినా ఆగస్టుదాకా విద్యార్థులను ఖాళీగా వదిలేయకుండా సిలబసుకి తోడ్పడే కో-కరిక్యులర్ విషయాలను ఆన్లైన్ ద్వారా అందించే ఏర్పాటు చేయాలనీ, ఆ విషయాన్ని పేరెంట్స్ అంగీకారంతోనే అమలు చేయాలని చర్చిస్తోంది. కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నవి. 
       సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వున్నందున ఆన్లైన్ క్లాసుల నిర్వహణ అవసరమవుతోంది. అయితే అది ఖర్చుతో కూడిన పనే. పాఠశాలల్లో ఆన్లైన్ బోధనకు అవసరమైన సాధనాలు, సదుపాయాలు సమకూర్చుకోవాలి. అందుకోసమనే కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు రూ 5-10 వేలు ఫీజులు వసూలు చేస్తున్నవి. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్సుతో పాటు ట్యాబ్స్ అమ్ముతున్నవి. ఫీజు చెల్లించకపోయితే ఆన్లైన్ కనెక్షన్ యిచ్చేది లేదని బెదిరిస్తున్నవి. స్కూల్లో అమ్మే ట్యాబ్ కొనలేకపోయినా ఇంట్లో సిస్టం లేదా ల్యాప్ ట్యాప్ లేదా స్మార్ట్ ఫోన్ వుండాలి. ఇంట్లో పాఠశాల విద్యార్థులు ఇద్దరు వుంటే రెండేసి వుండాలి. హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం వైఫై లేదా డేటా సదుపాయం కావాలి. ఆన్లైన్లో చెప్పే పాఠాలు స్పష్టంగా చూడాలంటే 50 ఎంబీపిఎస్ నెట్ వర్క్, 500 జీబీ సామర్ధ్యం గల స్మార్ట్ ఫోన్ వుండాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఒక క్లాసుకి ఒక జీబీ చొప్పున రోజుకి ఎన్ని క్లాసులు చూస్తే అన్ని జీబీలు ఖర్చవుతుంటది. అలాంటి ఏర్పాట్లు చేసుకుని అదనపు ఖర్చు భరించినా ఆన్లైన్ క్లాసులతో బోధనాభ్యాసన అరకొరగానే వుండవచ్చు. పట్టణ ప్రాంతాల్లో 41% మరియు గ్రామీణ ప్రాంతాల్లో 12% మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో వుంటుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమస్యలను అధిగమించి ఈ అసాధారణ పరిస్థితిలో అవసరమైన మేరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణ అనివార్యం అవుతోంది. 
       ఎన్సీఈఆర్టీ, అజీమ్ ప్రేమ్ జీ లాంటి సంస్థలు సూచించినట్లుగా 3-5 తరగతుల విద్యార్థులకు వారానికి 4 గంటలు, 6-8 తరగతుల వారికి 7 గంటలు, 9-12 తరగతులకు 10 గంటలు సమయమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి. ఎల్కేజీ, యూకేజీ మరియు 1-2 తరగతుల పిల్లలకు ఆన్లైన్ క్లాసులను నిషేధించాలి. పాఠశాల సమయాల్లోనే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలకు తోడు జనరల్ నాలెడ్జి, లైఫ్ స్కిల్స్, మోరల్ వ్యాల్యూ ఎడ్యుకేషనుకి సంబంధించిన విషయాలు చెప్పాలి. ఆన్లైన్ పాఠాలు అందుబాటులో లేని వారికి రికార్డ్ చేసిన పాఠాలను వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు లేదా ట్యాబులు మరియు అవసమైన డేటా కార్డులు ప్రభుత్వమే అందించాలి. ఆన్లైన్ క్లాసుల సమయంలో విద్యార్థులకు తోడ్పాటుగా తల్లి/తండ్రి/అన్న/అక్క లేదా టీచర్ అందుబాటులో వుండాలి. జూలై నుండి అయినా ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు  విద్యాశాఖ పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మేలు జరుగుతుంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలను ఎంహెచ్చార్డీ, సీబీఎస్ఈ చూసుకొంటుంది. కాగా సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఆన్లైన్ పాఠాలను నియంత్రించే పనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటే ఆయా పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట  లభించగలదు. ఏదేమైనా పాఠశాలలు ప్రారంభించే వరకు విద్యార్థులు ఎకడమిక్ విషయాలతో మమేకం కావడానికి ప్రభుత్వం, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషి సమన్వయం పెరగాల్సిన అవసరం వున్నది. @ 
- నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త 9490300577
  చైర్మన్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సిఈఎస్), హైద్రాబాద్. 

19, జూన్ 2020, శుక్రవారం

Fathers Day

Let us Celebrate FATHERS DAY 2020:
Nagati Narayana, State President
Telangana Parents Association (TPA)

Father's Day is a day you want to spend only with your dad just like best friends, doing the things that you, may be can't, on any other day! It's a day of celebrations and spoiling your dad with surprise gifts. Children, no matter how old they are, cherish this beautiful bond of love with their dad.

This year spending time outside home may not be the best thing to do because of the COVID-19 pandemic but there are a number of things you can do indoors with your dad. So start the planning now!
Traditionally Father's Day has been celebrated since the early 20th century. In America, it was first celebrated in 1908 on the third Sunday of June. In many European countries Father's Day is marked on March 19 as Saint Joseph's Day.

Father's Day is celebrated in many parts of the world at different times of the year, mostly in March, May and June.
In India, we celebrate Father's Day on the third Sunday of June and though it is not a public holiday, there are festivities all around. Restaurants, stores holiday destinations have special offers for daddies and children. Gift shops stock up way ahead of the day with greeting cards, coffee mugs, watches, wrist bands, books and other items.

Social media is abuzz with greetings and fond messages for daddies. Here are some ideas for you:
'My daddy is the best'
'My daddy, my best friend'
'Super dad, super pal'
'Daddy dearest, daddy cool'
------

22, మే 2020, శుక్రవారం

TSTV on Education

IASBABA’S INTEGRATED LEARNING PROGRAMME (ILP)

Primary Education Opportunities & Challenges

Archives

TOPIC: General Studies 2

  • Issues relating to development and management of Social Sector/Services relating to Education

In News: In the second week of March, state governments across the country began shutting down schools and colleges temporarily as a measure to contain the spread of the novel coronavirus. It’s close to two months and there is no certainty when they will reopen. This is a crucial time for the education sector. 

As the days pass by with no immediate solution to stop the outbreak of Covid-19, school closures will not only have a short-term impact on the continuity of learning but will also have far-reaching consequences. 

  • The structure of schooling and learning, including teaching and assessment methodologies, was the first to be affected by these closures. 
  • Only a handful of private schools could adopt online teaching methods. Their low-income private and government school counterparts, on the other hand, have completely shut down for not having access to e-learning solutions. 

The 2017-18 National Sample Survey reported only 23.8 percent of Indian households had internet access. In rural households (66 percent of the population), only 14.9 percent had access, and in urban households only 42 percent had access. And males are the primary users: 16 percent of women had access to mobile internet, compared to 36 percent of men. Young people’s access is even less: A recent news report stated only 12.5 percent of students had access to smartphones. Furthermore, most teachers are ill-equipped for online teaching.

According to data collected by the National Sample Survey as a part of the Survey on Education (2014), only 27% of households in India have some member with access to internet. Access to internet does not necessarily mean that a household actually has internet at home. In fact, only half of the households (47%) that have any access to internet own a computing device (including a smartphone). While direct estimates on how many households have internet access at home are hard to get, one can make a rough estimate by assuming that those who have internet at home report some internet access in general, and report possession of a device that can be used to go on the web.

Using this definition, only 12.5% of the households of students in India have internet access at home. There is an urban-rural divide: 27% have access in urban areas and only 5% in rural areas. 

So what are the lessons learnt?

A multi-pronged strategy is necessary to manage the crisis and build a resilient Indian education system in the long term. The disruption to education systems worldwide offers valuable lessons and provides a unique opportunity to reimagine education, the curriculum, and pedagogy.

  1. Address the digital divide – inclusive e-learning solutions:Technology has the potential to achieve universal quality education and improve learning outcomes. But in order to unleash its potential, the digital divide (and its embedded gender divide) must be addressed. Digital capabilities, the required infrastructure, and connectivity must reach the remotest and poorest communities. Access to technology and the internet is an urgent requirement and should no longer be a luxury.
  2. Reorient the curriculum.While teachers are struggling to learn digital ways of communicating with their students, it is clear that we need to pay close attention to what we teach. This crisis is teaching us that curricula must be grounded in students’ realities, cultivating critical, creative, and flexible thinking, resilience, and empathy in students. Developing a symbiotic relationship with our environment has taken on a new urgency, and teachers must help students think about their relationship with the universe and everyone and everything in it.
  3. Empower a wider cadre of teachers.This crisis is forcing teachers to reinvent their roles from that of transferring information to enabling learning. The shift to distance learning has afforded many opportunities to teach differently, encouraging self-learning, providing opportunities to learn from diverse resources, and allowing customized learning for diverse needs through high-tech and low-tech sources. Improving the education system requires a decentralized, democratic community-based approach, where community ownership of education is cultivated. Important for this is the hiring of local teachers (with adequate Dalit and female representation), which increases teachers’ accountability to children’s families and their ability to empathize with students’ lives.
  4. Establish quality assurance mechanisms and quality benchmark for online learning: Many e-learning players offer multiple courses on the same subjects with different levels of certifications, methodology and assessment parameters. So, the quality of courses may differ across different e-learning platforms.

21, మే 2020, గురువారం

Multiple degrees simultaneously

Should students be given multiple degrees simultaneously?

Rajeev Sobti17 AUGUST 2019 17:00 IST
UPDATED: 19 AUGUST 2019 14:12 IST

The UGC has set up a panel to consider giving multiple degrees to students from the same university or from other universities. How will this pan out?

Many changes are being proposed to uplift the quality of Indian education. One such initiative being taken by the University Grants Commission (UGC), is to consider allowing students to opt for multiple degree courses simultaneously. A lot of deliberation took place earlier to consider this. However, it was rejected almost immediately. It has resurfaced again owing to the rapid change in technology as there is a demand for professionals who are multidisciplinary. This is leading to a vast majority of people wanting to pursue specialised courses besides their regular degree programmes. That is why the idea of giving multiple degrees is being reconsidered once again.

Today, job aspirants need to learn multiple skills within a short span. It is difficult to achieve this by joining a regular course that flows at its own pace. So, allowing a student to pursue multiple courses, simultaneously, through different modes (regular/online/distance/part time), can help make them future-ready. It will allow students to acquire knowledge and skill in related or unrelated areas, without spending extra years on studies.

Healthy fusion

Advertising
Advertising

Although the option to acquire specialised skills through online certifications from various platforms such as Udacity, Edx, Neptel, and so on, are also available to a student today, but these are not degree programmes. Hence, the deliberation of offering multiple degrees is a welcome move. A lot of caution needs to be exercised before allowing the students to obtain multiple degrees though. There should be some criteria of shortlisting the institutes which can be allowed to offer multiple degrees to students. The mushrooming of institutes without statutory approvals and requisite infrastructure and resources should not be allowed. We are a country where over 80% of engineering graduates are found unemployable every year. Such a move, without the right restrictions, may lead to unqualified students getting degrees for the sake of it, without enabling them to acquire the right knowledge and skills. Another important consideration in the implementation of this idea could be whether it should be allowed for every student irrespective of his or her calibre or to a select few. Students should be allowed to pursue multiple degrees from a single institute and in a limited set of disciplines, only if he/she clears a minimum eligibility criteria prescribed specifically to pursue two degrees simultaneously. Otherwise, many students will opt for this initially, but may end up losing out on both degrees due to excessive study load.

The recognition of the multiple degrees also needs to be ensured in the ecosystem. The main hurdle in this kind of a system will be the acceptability, not only by the industry but also in the government organisations where the rules need to be modified to allow these students to be eligible on the basis of any degree. If the implementation of this idea is executed in the right spirit and with caution, the ultimate gainer will be the student in particular, and industry in general, as it would lead to availability of highly trained and knowledgeable manpower in limited time.

The writer is Head of Division of Admissions at Lovely Professional University

Student speak

Kritika Rathore, II, M.A. English literature, Presidency University, Kolkata

Multiple degrees help you stand out from the rest. It shows your specialisation and interests and gives you an upper hand in the job prospects. This decision by the UGC will be helpful for students who want to pursue other courses along with their formal degree . Having an additional degree will help students who lack real-world experience related to their field.

Preeti Shibu, Graduate (2018), B.Arch, School of Architecture and Planning, Anna University, Chennai

Upon graduation, youngsters face a highly competitive job market. While pursuing two degree programmes might seem like a lot of effort, this will allow those with varying interests to be open to more potential career paths. Students would have to develop their organisation skills and this might be impressive to employees.

Prasanna Aditya A, II, BA (Hons.), II, Political Science, Hindu College, Delhi University, Delhi

One may be hard-pressed to come across a high school graduate these days, who is not passionate about more than one field of study. Students are in a quandary to choose from among disciplines for their college studies, all of which they hold dear. This move is laudable because while specialisation in a specific field of study is required, interdisciplinary pursuits are the order of the day. It expands students’ intellectual ambit, encouraging him/her to think out-of-the box. If put into action, it would foster a culture of interdisciplinary study and erudition in the Indian academic environment.

Philip K. Varghese, II, Mechatronics Engineering, BE, SNS College of Technology, Coimbatore

Pursuing multiple degrees can be challenging and takes a lot of effort and time investment. One should focus on one degree at a time as it can get strenuous and perhaps lead to confusion. On the other hand, it mostly depends on the ability of the student and his/her dedication towards learning more and pursuing multiple interests at the same time