ది. 22-04-2020
గౌరవనీయ శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గార్కి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు,
వెలగపూడి, అమరావతి.
మహాశయా!
విషయం:- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుకు 'సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీస్ (సిఈఎస్ఎస్)' సూచనలు.
ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు పేదల పిల్లలకు సంపన్నుల పిల్లలతో సమానమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనే మీ ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయమైంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో జీఓ 20 ద్వారా తల్లిదండ్రుల ఎంపిక (ఆప్సన్) లు సేకరించే పనికి పూనుకోవడం ముదావహం. 90 శాతం పైగా ఇంగ్లీష్ మీడియంకే ఆప్సన్స్ వస్తాయనే మా అభిప్రాయం. ఆ మేరకు ఆంగ్ల మాధ్యమం అమలుకు హైకోర్టు తీర్పుతో ఎదురై న అవరోధాన్ని అధిగమించవచ్చు. కానీ అన్ని పాఠశాలల్లోని 1-5 తరగతులను ఒకేసారి (2020-21 విద్యాసంవత్సరం) తెలుగు మీడియం ఉపాధ్యాయులతో అమలు చేయాలనుకోవడం అంత సులభమైన విషయం కాదు. అందుకు తగిన సన్నాహక ఏర్పాట్లు చేసుకుంటూ దశలవారీగా రెండు/మూడు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయడం మంచిది. ఉపాధ్యాయులను కాన్ఫిడెన్సులోకి తీసుకొని అవసరమైన ఉపకరణాలు, తర్ఫీదు యిచ్చి సన్నద్ధం చేయడం చాలా ముఖ్యమైన విషయం. వందమంది లోపు విద్యార్థులు మరియు ఇద్దరు లేక ముగ్గురు ఉపాధ్యాయులు వుండే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం కష్టం. 300 మంది పైగా విద్యార్థులు, 20 మందిపైగా ఉపాధ్యాయులు వుండేలా మరియు సరిపడినంత వసతి సదుపాయం గల పాఠశాలలు అయితే ఇంగ్లీష్ మీడియం అమలుకు అనువుగా వుంటవి. కేంద్ర ప్రాయోజిత పథకం సమగ్ర శిక్ష అభియాన్ యిచ్చిన ఫ్రేమ్ వర్క్ ఆధారంగా అలాంటి ఇంటిగ్రేటెడ్/కాంపోజిట్ హైస్కూళ్లుగా కొన్ని పాఠశాలలను మార్చవచ్చు. అలాంటి ఏర్పాటు ఫలితంగా మూతపడే చిన్న, సన్నకారు పాఠశాలల విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించాలి. సమగ్ర శిక్ష పథకంలోని ప్రొవిజన్స్ అన్నింటి నీ ఉపయోగించి ఇంటిగ్రేటెడ్ /కాంపోజిట్ స్కూల్సును సమగ్రమైన ఫుల్ ప్లెడ్జుడ్ పాఠశాలలుగా అభివృద్ధి చేయవచ్చును. ఇప్పటికే ప్రారంభించిన టీచర్స్ ట్రైనింగ్, టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ వంటి సన్నాహక చర్యలు కొనసాగిస్తూ ఇతర సన్నాహక కార్యక్రమాలు కూడా చేపట్ట వచ్చును. ఎంత కష్టమైనా, నిష్ఠురమైనా ఇంగ్లీష్ మీడియం అమలు చేయడమే మంచిదని సూచిస్తున్నాము.
నాగటి నారాయణ, చైర్మన్
సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ అండ్ సర్వీస్ (సిఈఎస్ఎస్), హైద్రాబాద్ 9490300577, 9121047973
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి