CESS Press release dt 08 Feb 2020.
*రాష్ట్ర బడ్జెటులో విద్యకి అన్యాయం: సెస్ అసంతృప్తి*
2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెటులో విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరిగుతుందని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సిఈఎస్) అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. విద్యారంగం అవసరాలు అధికమవుతున్నా, బడ్జెట్ సైజ్ పెరుగుతున్నా విద్యకి కేటాయింపు పెరగక పోవడమే కాక గత సంవత్సరాల కంటే తగ్గిపోవడం అత్యంత ఆందోళనకరంగా వుంది. ఈ బడ్జెట్ (₹ 1,82,914 కోట్లు) మొత్తంలో విద్యారంగానికి ప్రతిపాదించింది (₹ 12,144 కోట్లు) 6.63 శాతం మాత్రమే. ఇది తెలంగాణ రాష్ట్ర గత బడ్జట్లు అన్నిటికంటే అధమం. 2017-18 (₹ 12,494 కోట్లు) మరియు 2018-19 (₹ 12,669 కోట్లు) సంవత్సరాల బడ్జెటులలో కన్నా తక్కువే. 2019-20 బడ్జెట్ లో విద్యారంగానికి నికరంగా అయిన ఖర్చెంతో కూడా ప్రభుత్వం చెప్పలేకపోయింది. ఇప్పటికే విద్యాభివృద్ధి సూచికల్లో తెలంగాణ రాష్ట్రం అట్టడుగున 27 వ స్థానంలో వుంది. అభ్యసన సామర్ధ్యాల సాధనలో 15 వ స్థానంలో వుంది. సమగ్ర శిక్ష అమలుకు అవసరమైన విధంగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు, ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ అమలుకు మరియు అదనపు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలు, వసతులు సదుపాయాల కల్పన తదితర అవసరాలు తీర్చాల్సి వుంది. ఇప్పుడు కేటాయించిన అత్తెసరు బడ్జెట్ తో అదనపు అవసరాలు తీర్చే అవకాశం లేకపోగా రాష్ట్ర విద్యారంగం మరింత దిగజారే దుస్థితి దాపురిస్తుంది. కనుక రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 20 శాతం వరకు కేటాయింపు పెంచాలని సెస్ డిమాండ్ చేస్తోంది.
*నాగటి నారాయణ* చైర్మన్
*పగడాల లక్ష్మయ్య* సెక్రటరీ
సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సిఈఎస్), హైదరాబాద్.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి