విద్యలో ఫెయిలైన ప్రభుత్వాలు
నాగటి నారాయణ
అభివృద్ధికి కీలకమైన విద్యారంగాన్ని విస్మరించడం వలనే మానవాభివృద్ధి సూచికల్లో భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్రం బాగా వెనకబడిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్ 2018 అక్టోబరులో ప్రకటించిన మానవ మూలధనం సూచికల్లో 157 దేశాల్లో భారతదేశం 115 వ స్థానంలోనే వుండిపోయింది. పొరుగు దేశాలైన శ్రీలంక 72, నేపాల్ 102, బంగ్లాదేశ్ 106, మయన్మార్ 107 కంటే కూడా వెనకబడి వుంది. కాగా అక్షరాస్యతలో, విద్యాభివృద్ధిలో దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం 28 వ స్థానంలో వున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదికల్లో వున్నది. ఆర్ధికాభివృద్ధిలో దేశం, రాష్ట్రం దూసుకు పోతున్నట్లు పాలకులు గొప్పలు పోతున్నా విద్యారంగంలో అవమానకరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోల్లో ఎంతో ప్రాధాన్యతను పేర్కొన్నా ఐదేళ్ల పాలనలో అరకొర చర్యలతో అమలు చేయకుండా వదిలి వేయడం అలవాటుగా మారింది.
దేశాన్ని అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అందరికీ సమానమైన విద్య అందించాల్సిన లక్ష్యాన్ని సాధించలేకపోయినవి. ఆ పని ఐదేళ్లలోనే అమలుచేసి చూపిస్తామన్న బీజేపీ/ఎన్డీయే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది. 1986 తర్వాత మూడు దశాబ్దాల కాలం గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యావిధానాన్ని సమీక్షించలేక పోయాయని, సంవత్సర కాలంలోనే తమ ప్రభుత్వం ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తుందని 2014 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోడీ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఆ పని చేయచేక పోయారు. 2015 మార్చిలో ప్రజాభిప్రాయ సేకరణ కోసమంటూ కొన్ని థీమ్స్ ప్రకటించి, అదే సంవత్సరం అక్టోబరులో రిటైర్డ్ కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని నియమించారు. ఇచ్చిన గడువులోగా కమిటీ రిపోర్ట్ యిచ్చినా, అది ప్రభుత్వానికి నచ్చకపోవడం వలన బహిరంగ పర్చలేదు. పైగా 'విద్యా విధానం ముసాయిదా కోసం కొన్ని ఇన్పుట్స్' పేరుతో మరో చర్చాపత్రం ఎంహెచ్ఆర్డీ వెబ్సైటులో పెట్టింది. ముసాయిదా పత్రం తయారీ కోసమంటూ ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ కె. కస్తూరిరంగన్ కమిటీని నియమించారు. 2017 డిసెంబర్ నాటికే రావాల్సిన ఆ కమిటీ నివేదికను యింతవరకు తీసుకోకుండా కాలయాపన చేశారు. ఇది విద్యరంగంలో మోడీ ప్రభుత్వ మొదటి ఫెయిల్యూర్.
విద్యావిధానం విషయంలో రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వ పనితీరు కూడా కేంద్రం లాగే వుంది. టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో విద్యావిధానం గురించి యిలా చెప్పింది: "విద్యావిధానం లేనిచోట సమాజ వికాసం జరగదు. పేదరికం వల్ల తెలంగాణలో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించినప్పుడే పేదపిల్లలు చదువుకోవడానికి వీలవుతుంది. అందుకు యిప్పుడున్న విద్యావిధానం ఏమాత్రం సరిపోదు. సాంఘికాభివృద్ధికి పునాదిగా నిలిచే విద్యాభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రతి పేదపిల్లవాడు చదువుకునే విధంగా , ఆ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించే విధంగా నూతన విధానాన్ని అవలంబిస్తుంది." ఇంతవరకు అలాంటి ఊసే లేదు. కేజీ టు పీజీ విద్యా మిషన్ పేరుతో 520 గురుకులాలు ఏర్పాటు చేసి, వాటిలో సుమారు రెండు లక్షల మంది విద్యార్థులకు అవకాశం కల్పించింది. కానీ 24 లక్షలమంది విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వుంది. ప్రైవేట్ విద్యావ్యాపారాన్ని నియంత్రించే ఫీ రెగ్యులేషన్ ఉత్తర్వులు నెల రోజుల్లోనే యిస్తామని 2016 మార్చి 30 న ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రెండేళ్లు గడచినా ఉత్తర్వులు యివ్వలేక పోయారు. ఫీ రెగ్యులేషన్ కోసం ప్రొఫెసర్ టీ. తిరుపతి రావు కమిటీ యిచ్చిన నివేదికను కూడా బైట పెట్టలేక పోయింది.
విద్యారంగం 'నానాటికి తీసికట్టు నాగంబొట్టు' అన్నట్లుగా గిడసబారి పోవడానికి నిధుల కొరత ప్రధాన కారణం. దేశంలో సత్వర విద్యాభివృద్ధి కోసం కేంద్ర బడ్జెటులో పది శాతం చొప్పున మరియు రాష్ట్రాల బడ్జటులలో ఇరవై శాతం చొప్పున విద్యారంగానికి నిధులు కేటాయించాలని 1958 లో బి.జి.ఖేర్ కమిటీ చేసిన సిఫార్సు గానీ, జాతీయ స్థూల ఉత్పత్తిలో ఆరు శాతం నిధులను విద్యకు వెచ్చించాలని 1968 లో డి.ఎస్.కొఠారి కమీషన్ చేసిన రికమండేషన్ గానీ యింతవరకు అమలు కాలేదు. కాగా గడచిన ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర బడ్జటులలో విద్యారంగం వాటా ఆయేటికాయేడు క్షీణించింది. తొలి (2014-15) బడ్జెటులో విద్యారంగానికి రూ. 1,10,351 కోట్లు కేటాయించిన మోడీ ప్రభుత్వం, తదుపరి సంవత్సరాల్లో తగ్గిస్తూ చివరి (2019-20) బడ్జెటులో రూ. 93,848 కోట్లు కేటాయించింది. బడ్జెటులో విద్యారంగం వాటా 6.15 శాతం నుండి 3.30 శాతంకి తగ్గిపోయింది. నిధుల కొరత వలన అన్ని స్థాయిల్లోని విద్యాభివృద్ధి కుంటుపడింది. హైయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ (హెచ్ఈఎఫ్ఏ) రూ. 24,430 కోట్లు అడిగితే గతేడాది యిచ్చిన రూ. 2,750 కోట్లు కంటే తక్కువగా రూ. 2,100 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో యాబై శాతం పైగా ఖాళీగా వున్న ప్రొఫెసర్లు, లెక్చరర్ల పోస్టులు భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. విద్యారంగాన్ని చిన్నచూపు చూడటంలో మోడీ అడుగుజాడల్లోనే కేసీఆర్ నడుస్తున్నట్లు వుంది. తెలంగాణ రాష్ట్రం తొలి బడ్జటులో విద్యారంగం వాటా 10.88 శాతం వుండగా చివరి బడ్జెటులో 6.71 శాతానికి దిగజారింది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకాలు లేకపోవడంతో విద్యాప్రమాణాలు పతనమవుతున్నవి.
ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ప్రైవేట్ విద్యావ్యాపారం విస్తరించింది. గడచిన ఐదేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో కోటి ముప్పై లక్షల మంది విద్యార్థులు తగ్గిపోగా ప్రైవేట్ స్కూళ్లలో కోటి డెబ్బై లక్షల మంది పెరిగారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 52% బడి పిల్లలు ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్సులో వున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లలో విద్యార్థుల సంఖ్య సర్కార్ బడులలో 65 వేలు క్షీణించి, ప్రైవేట్ స్కూల్సులో 1.20 లక్షలు పెరిగినట్లు కాగ్ రిపోర్టులో పేర్కొనబడింది. ఉన్నత, వృత్తి విద్యల్లోని విద్యార్థుల్లో 80% పైగా ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే వున్నారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ చర్యలతో విద్యారంగంలో వినాశకర పరిణామాలు సంభవిస్తున్నవి. ఐదు మరియు ఏడు తరగతుల్లో డిటెన్షన్ విధానం తేవటం వలన బడుగు బలహీన తరగతుల విద్యార్థులు బడికి దూరమయ్యే దుస్థితి దాపురిస్తుంది. రైతుల పేదరికాన్ని, దళితుల దయనీయ స్థితిని వివరించే చారిత్రక పాఠాలను తొలగిస్తూ విద్యార్థులు సామాజిక సమస్యలు తెలుసుకోకుండా చేస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థలకు ఆర్ఎస్ఎస్ లో శిక్షణ పొందిన వారినే నియమిస్తూ విద్యారంగంలో లౌకిక పునాదులను పెకలిస్తోంది. భారతీయ శిక్షా బోర్డ్ పేరుతో వేద విద్య కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి యోగా గరు బాబా రాందేవ్ కి అప్పగిస్తోంది. 'చూస్తూ వుంటే మేస్తూ పోయింది' అన్నట్లుగా వుంది కేంద్ర ప్రభుత్వ నిర్వాకం.
ఈ ప్రభుత్వాలే కొనసాగితే విద్యారంగం యింకా దివాళా తీసే పరిస్థితి దాపురిస్తుంది. విద్యలో ఫెయిలైన ప్రభుత్వాలను డిటెయిన్ చేస్తేనే విద్యారంగానికి మేలు జరిగేది. ఈ ఎన్నికల్లో విద్యావంతులు, విద్యారంగ శ్రేయోభిలాషుల తీర్పు అందుకు దోహదపడాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్య తరగతి మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల తీర్పు ఆశాజనకంగా కనిపించింది. టీచర్, గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో బహిర్గతమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత ప్రభావితం కావాలి.
------
- నాగటి నారాయణ ది. 6-4-2019

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి